ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఆకట్టుకుంది.. ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు హైలెట్ అంటూ ప్రేక్షకుల అభిప్రాయం

అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన 'లెనిన్' చిత్రం నేడు (జూలై 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున, నాగవంశీ నిర్మించారు.

మొదటి షోలు ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో ప్రేక్షకులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఎక్కువ మంది సినిమా బాగుందని, ముఖ్యంగా అఖిల్ నటన ఆకట్టుకుందని ప్రశంసిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, భావోద్వేగాలతో సాగిన కథ ప్రేక్షకులను మెప్పించిందని పోస్టులు చేస్తున్నారు.